Wednesday, November 20, 2024

బూస్టర్ డోస్ కు అనుమతివ్వండి… కేంద్రాన్ని కోరిన మంత్రి హరీశ్ రావు

అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్ట‌ర్ మాన్సుక్ మాండ‌వీయ ఈరోజు అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ‌ల మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అర్హులైన వారంద‌రికీ బూస్ట‌ర్ డోస్ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్రంలో 32 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ నిల్వ ఉంద‌న్నారు. ఆ వ్యాక్సిన్ గ‌డువు తేదీ ముగిసేలోగా బూస్ట‌ర్ డోస్‌కు అనుమ‌తిస్తే ఉప‌యోగం ఉంటుంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. 18 ఏండ్లు పైబ‌డిన వారంద‌రికీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తివ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అయితే 60 ఏండ్లు పైబ‌డిన వారికి మాత్ర‌మే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బూస్ట‌ర్ డోసు ఇచ్చారు. మిగ‌తా వారికి బూస్ట‌ర్ డోసు ఇచ్చేందుకు ఇది స‌రైన సమయమని హ‌రీశ్‌రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement