Friday, November 22, 2024

HYD: సింప్లిసిటీ బ్లడ్‌ ప్రెజర్‌ ప్రొసీజర్‌ను ప్రారంభించిన మెడ్‌ట్రానిక్

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (ప్రభ న్యూస్‌) : మెడ్ట్రానిక్‌ పీఎల్సీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన ఇండియా మెడ్‌ట్రానిక్ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అధిక రక్తపోటు- చికిత్సకోసం సింప్లిసిటీ స్పైరల్రినల్‌ డినర్వే షన్‌ సిస్టమ్‌(ఆర్డీఎన్‌)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆర్డీఎన్‌ అనేది మినిమల్లీ ఇన్వేసివ్‌ థెరపీ. అతి చురుగ్గా మారి అధిక రక్తపోటుకు కారణమయ్యే కిడ్నీ సమీపంలోని నరాలను ఇది లక్ష్యం చేసుకుంటు-ంది. మెడ్‌ట్రానిక్ ఇటీవలే సిస్టమ్‌కు యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆమోదాన్ని పొందింది. పది సంవత్సరాల క్లినికల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ ఫలితం. అంతేగాకుండా ఈ సిస్టమ్‌కు భారతీయ నియంత్రణ సంస్థల ఆమోదం కూడా ఉంది. కార్డియోవాస్క్యులర్‌ మరణాలకు హైపర్‌ -టె-న్షన్‌ అతిపెద్ద కారణం. ఇది గుండెపోటు, స్ట్రోక్‌, గుండె వైఫల్యం, మూత్రపిండాల వైఫల్యం ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.

సింప్లిసిటీ స్పైరల్‌ బ్లడ్‌ప్రెజర్‌ ప్రొసీజర్‌ అధిక రక్తపోటును తగ్గించడంలో క్లినికల్‌ ఎఫికసీని ప్రదర్శించింది. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను తగ్గిస్తుంది. మెడ్ట్రానిక్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ బ్లాక్వెల్‌ మాట్లాడుతూ.. సింప్లిసిటీ బ్లడ్‌ప్రెజర్‌ ప్రొసీజర్‌తో ఆరోగ్య సంరక్షణ నిపుణులను శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అనియంత్రిత రక్తపోటు నిర్వహణకు సమగ్ర విధానాన్ని అందిస్తున్నామని, కార్డియోవాస్కులర్‌ థెరపీలలో అగ్రగామిగా రోగుల జీవితాలను మెరుగుపరిచే వినూత్న పరిష్కారాలను అందించడానికి మెడ్ట్రానిక్‌ కట్టుబడి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement