Friday, November 22, 2024

CPR: హార్ట్ బీట్‌ లేకుండా జ‌న‌నం… సీపీఆర్‌తో పునరుజ్జీవం…

హార్ట్ బీట్ లేకుండా ప‌సికందు జ‌న్మించింది. చ‌ల‌నం లేని ఆ బిడ్డ‌కు 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణం పోసి మ‌రో జ‌న్మ‌నిచ్చారు. మేడ్చల్‌ జిల్లా కీసర ప్రభుత్వాస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది దుర్గ. ఆమెకు నార్మల్ డెలివరీ అయింది.

అయితే.. పుట్టిన బిడ్డకు ఎలాంటి చలనం లేకపోవడంతో దుర్గ దంపతులు తల్లడిల్లిపోయారు. వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు బేబీకి హాట్‌ బీట్‌ లేదని చెప్పి.. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఎలాగైనా తమ బిడ్డను బతికించాలని కాళ్లా వేళ్లా పడి బతిమాలుకుంది దుర్గ.

పాపకు వెంటనే చికిత్స అందించేందుకు హుటాహుటిన 108లో పసిబిడ్డను తరలిస్తూనే సీపీఆర్‌ చేశారు. దీంతో వెంటనే ఆ బిడ్డ ఊపిరి తీసుకుని కెవ్వుమని ఏడవటం స్టార్ట్ చేసింది. పాప ఏడుపుతో ఆ తల్లిదండ్రుల కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. ఒక్కసారిగా పాపలో చలనం రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు 108 సిబ్బంది. ఇక తమ బిడ్డకు మరో జన్మనిచ్చారంటూ దుర్గ దంపతులు హృదయపూర్వకంగా 108 సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement