హైదరాబాద్: వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ ద్వారా నిర్వహించబడుతున్న మెక్‌డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ అండ్ సౌత్), అద్భుతమైన మల్టీ-మిల్లెట్ బన్‌ను విడుదల చేసేందుకు కేంద్ర శాస్త్ర అండ్ సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మకమైన ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సీఎస్ఐఆర్ -సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎఫ్ టిఆర్ఐ)తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ప్రత్యేకమైన మొట్టమొదటి భాగస్వామ్యం, సీఎస్ఐఆర్ -సిఎఫ్ టిఆర్ఐ నైపుణ్యం అండ్ పోషక ఆహార ఎంపికలను అభివృద్ధి చేయడంలో మెక్‌డొనాల్డ్ నిబద్ధతతో కలిపి ఆహార ఆవిష్కరణలో కొత్త శకాన్ని సూచిస్తుంది.
ఈసందర్భంగా సీఎస్ఐఆర్ -సిఎఫ్ టిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి అన్నపూర్ణ సింగ్ మాట్లాడుతూ… మెక్‌డొనాల్డ్స్ ఇండియా (డబ్ల్యు అండ్ ఎస్)తో తమ భాగస్వామ్యం అధునాతన ఆహార సాంకేతికత, పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఉత్తమ విధానాల వ్యూహాత్మక ఏకీకరణను సూచిస్తుందన్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నం అదనపు పోషక విలువలను అందించే మెనూ ఐటెమ్‌లను అభివృద్ధి చేయడంలో కీలకమైన ముందడుగుగా నిలుస్తుందన్నారు.
మెక్‌డొనాల్డ్స్ ఇండియా (డబ్ల్యు అండ్ ఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అక్షయ్ జటియా మాట్లాడుతూ… మెక్‌డొనాల్డ్స్ ఇండియా (డబ్ల్యు అండ్ ఎస్)లో తాము రియల్ ఫుడ్ దట్ ఈజ్ రియల్ గుడ్ అనిపించే ఆహరం అందించటానికి దీర్ఘకాల ప్రయాణంలో ఉన్నామన్నారు. మల్టీ-మిల్లెట్ బన్‌ను పరిచయం చేయడమనేది తమ కస్టమర్‌లు ఇష్టపడే రుచికి అనుగుణంగా తమ ఆఫర్‌ల పోషక విలువలను పెంపొందించడానికి కొనసాగుతున్న తమ ప్రయత్నాలకు ప్రతిబింబమన్నారు.