హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికకు రాష్ర్ట ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ప్రమాణస్వీకారం ముగించాలని తెలిపింది. మ. 3:30 గంటలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.