Tuesday, November 26, 2024

ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ

పేదలు, మధ్యతరగతి వారికి ఉచిత ఆయుర్వేద వైద్యం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయుష్ ద్వారా ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ అంబేద్కర్ భవనంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. నెహ్రూ యువ కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ ద్వారా ఫ్రీ ఆయుర్వేద మెగా హెల్త్ క్యాంప్ శనివారం ప్రారంభించి ఉచిత ఆయుర్వేద మందులను మేయర్ అందజేశారు. మెగా హెల్త్ క్యాంప్ లో జనరల్ మెడిసిన్స్ ఆర్థోపెడిక్ కార్డియాలజీ గ్యాస్ట్రో ఎంటిరాలజీ ఈఎన్ టి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేయర్ స్వయంగా వైద్య శిబిరంలో పాల్గొని పరీక్ష నిర్వహించుకున్నారు. జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులు కూడా వైద్య శిబిరంలో పాల్గొని చికిత్సలు చేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాలను వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో నవ్య శ్రీ సామాజిక సేవ సమితి గ్లెన్ ఈగల్స్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement