మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని సఫిల్ గుడా మినీ ట్యాంక్ బండ్ చెరువును హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ సందర్శించారు. గత కొన్ని రోజులుగా పట్టువదలని విక్రమార్కుడిలా మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ సఫిల్ గుడా చెరువును సుందరీకరణ చేయాలి, చెరువులో మురికి నీరు కలవకుండా ఏర్పాట్లు చేయాలి, గుర్రపు డెక్క నిర్మూలన వంటి సమస్యలపై జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాల్లో పోరాడుతున్నాడు.
ఆయన డిమాండ్ మేరకు ఈరోజు నగర మేయర్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రవణ్ ఇక్కడ ఉన్న పరిస్థితులను, దీనివలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు కూలంకుశంగా వివరించారు. వెంటనే ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్ సంబంధిత అధికారులు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.