అస్టార్ ప్రైవేటు ఆసుపత్రి అధ్వర్యంలో బంజారా హిల్స్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ యూనిట్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… పేదల కోసం హెల్త్ క్యాంపులను నిర్వహించి నిర్ధారించిన వ్యాధులకు చికిత్స అందించడాన్ని అభినందించారు. దీర్ఘకాలిక వ్యాధులతో భాధ పడుతున్న వారికి పూర్తిగా ఉచితంగా చికిత్సతో పాటుగా మందులను అందజేసేందుకు అస్టర్ ఆసుపత్రి ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కృషితో నగరంలో పలు మురికి వీధుల్లో నివసించే ప్రజల కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారని, ఇప్పటి వరకు నగరంలో 256 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అవసరమైన చోట మరిన్ని బస్తీ దవాఖానాల ఏర్పాటుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నట్లు మేయర్ వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement