Tuesday, November 26, 2024

విద్యార్థులకు బ్యాగ్ లు పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

కోవిడ్ -19 అనంతరం సాంఘికంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి చేయూతనందించేందుకు కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్లు తమ వంతు సహాయాన్ని ప్రపంచవ్యాప్తంగా సోషల్ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇంటెల్ (వీలవ్ యు) ఆర్గనైజేషన్ తమ వాలంటరీ సర్వీస్ లో భాగంగా బుధ‌వారం షేర్ మథర్స్ లవ్ పేరిట నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఎన్.బి.టి నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా 600 స్కూల్ బ్యాగ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ… సోషల్ సర్వీస్ ద్వారా ప్రతి ఒక్కరికి భరోసా, సంతోషం, ప్రేమ, ఆప్యాయతలు చేరవేస్తుందన్నారు. ఈ సంస్థ ద్వారా తెలంగాణలో 5వేల మంది వాలంట‌రీ సోషల్ సర్వీసెస్ అందిస్తూ తెలంగాణను గ్లోబల్ విలేజ్ గా, ప్రశాంతత, ఐక్యతకు నిలయంగా మారుస్తున్నారన్నారు. ఈ సంస్థ ద్వారా పరిశుభ్రతను పాటిస్తూ వరల్డ్ క్లీన్ మూవ్ మెంట్, బ్లెడ్ డొనేషన్, ట్రీ ప్లాంటేషన్, చైల్డ్ అండ్ ఎల్డర్లీ సంక్షేమ కార్యక్రమాలు, చెరువుల శుభ్రత వంటి అనేక కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. ఈ సంస్థ ఛైర్మన్ జహన్ గిల్ జా ప్రపంచమంతటికీ తల్లి అనే అంశంపై 2000 సంవత్సరం నుండి ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండేందుకు సమాజంలో ఇలాంటి కార్యక్రమాలను తమ వాలంటరీల‌ ద్వారా నిరంతరాయంగా కొనసాగిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement