Thursday, November 21, 2024

ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి..

మోండా: కరోనా మహమ్మారి తిరిగి వేగంగా ప్రబలుతున్న నేపధ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని గోపాల పురం ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌ అన్నారు. చిలకలగూడ చౌరస్తా తదితర కూడళ్ళలో మాస్కుల ధారణపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి మాస్కులు ధరించని వారికి అవగాహన కల్పిపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ నిబంధనలను అందరు పాటించాలన్నారు. వాహనదారులు, పాదచారులు ఎవ్వరైనా సరే మాస్కులు ధరించకుండా రోడ్లపైకి రావద్దని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా బయటకు వస్తే వారికి చలాన్లు సైతం వేయనున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్సైలు బాలకృష్ణ, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement