Saturday, November 23, 2024

HYD: మసాలా సినిమా రివ్యూ లా.. ఏక్ ఫిల్మ్ కథ.. గోపాల్ దత్

హైదరాబాద్ : మసాలా సినిమా రివ్యూ లాగా ఏక్ ఫిల్మ్ కథ సాగుతుందని గోపాల్ దత్ అన్నారు. జీ థియేటర్ సంకలనం కోయి బాత్ చలే లో భాగమైన ఏక్ ఫిల్మ్ కథ ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లోకి అనువదించబడింది. గోపాల్ దత్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి, 1999లో రంగస్థలంపై తన కళాత్మక ప్రయాణాన్ని ప్రారంభించిన అతను ముఝే కుచ్ కెహనా హై, తేరే నామ్, సామ్రాట్ అండ్ కో. ఫిల్మిస్తాన్ వంటి చిత్రాలలో నటించారు. ఇటీవలే థియేటర్‌తో మళ్లీ కనెక్ట్ అయిన అతను సీమా పహ్వా దర్శకత్వం వహించిన కోయి బాత్ చలే లో నటించాడు.

ఆయన మాట్లాడుతూ… బాలీవుడ్ చిత్రాలను దక్షిణ భారత భాషల్లోకి రీమేక్ చేసే ట్రెండ్ ఉందని తమకు తెలుసు అన్నారు. ఓవరాల్ గా భారతీయ సినిమా అన్ని చోట్లా ఒకేలా ఉంటుంది. అనేక సాధారణ మసాలా చిత్రాలు ప్రాథమిక కథాంశంలో చాలా మార్పులు లేకుండా ప్రాంతీయ భాషలలో రీమేక్ చేయబడ్డాయని అన్నారు. ప్రస్తుతం మన సినిమాలో లోటు ఏమిటంటే.. సాహిత్యం. భారతీయ సాహిత్యంలో గొప్ప రచయితల గురించి యువ తరానికి తెలియదన్నారు. ఆ మిస్సింగ్ లింక్‌ను కనుగొనడం చాలా ముఖ్యం, సాదత్ హసన్ మాంటో, మున్షీ ప్రేమ్‌చంద్ మరియు పర్సాయ్ వంటి గొప్ప రచయితల కథలను మళ్లీ సందర్శించడానికి కోయి బాత్ చలే చాలా మంచి ప్రయత్నమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement