ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్.. తెలంగాణ అలర్ట్
గాయపడ్డ మావోల కోసం.. సరిహద్దుల్లో బలగాల వెూహరింపు
తెలంగాణలోనూ ఛత్తీస్గఢ్ తరహా వ్యూహం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మావోల మారణకాండ.. తెలుగు రాష్ట్రాలను ఉలికిపాటుకు గురిచేసింది. చత్తీస్గఢ్, బీజాపూర్ సుక్మా జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. సుక్మా జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో వివిధ దళాలకు చెందిన 23మంది జవాన్లు మరణించగా, మరో 31 మంది
జవాన్లు గాయపడ్డారు. ఎన్కౌంటర్ తర్వాత తెలం గాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో సోమవారం సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా మోహరిం చాయి. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగు తోంది. గాయపడ్డ మావోయిస్టులు పక్క రాష్ట్రా లకు పరారయ్యే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లో పోలీసు పహారా పెంచారు. మావోయిస్టులు చత్తీస్గఢ్ నుంచి గోదావరి ఇవతలి ఒడ్డుకు వస్తారన్న అనుమా నంతో కూంబింగ్ కొనసాగుతోంది. భూపాలపల్లి, ములు గు జిల్లా ఏజెన్సీని భద్రతా బలగాలు జల్లెడ పడు తున్నాయి.
కొరియర్ వ్యవస్థే ఎరగా..
పోలీసులు గతంలో మావోల నిర్మూలనకు వాడు కున్న కొరియర్ వ్యవస్థనే తిరిగి సంచలనాల కోసం మా వోలు వాడుకునే వ్యూహంతో ఉన్నారని, కొత్త పద్దతుల్లో పోరాటం చేసే అవకాశముందని గతంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఆంధ్రప్రభలోనూ.. మావోల మెరుపు వ్యూహాలపై గతంలో ప్రత్యేక కథనం ప్రచురి తమైంది. ఇపుడు అదే పద్దతిలో కొరియర్లను ఎరగా వేసి సమాచారం ఇచ్చి మరీ.. ఒకేసారి 400మంది నక్సల్స్ బుల్లె ట్ల వర్షం కురిపించడం, మారణకాండ సాగించడం దేశ చరిత్రలోనే సంచలనంగా మారింది. తెలంగాణలోనూ.. ఈ తరహా దాడులకు ఆస్కారం ఉందని, కొరియర్ వ్యవ స్థను గుడ్డిగా నమ్ముకుని ముందుకు వెళ్ళొద్దని కేంద్ర నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఛత్తీస్గడ్లో మావోల దాడి.. బల ప్రదర్శన, అధునాతన ఆయుధాలను పోలీసుల నుండి స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు పోలీస్ వర్గా లను షాక్కు గురిచేస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేక బలగాలు మోహరించారు.