రంగారెడ్డి బ్యూరో: అవి నీతికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు ఒక్కొ క్కరు దొరికిపోతున్నారు. ఐదేళ్లకాలంలో దండి గా డబ్బులు సంపాదించాలనే ఆశతో రెండు చేతు లా సంపాదిస్తున్నారు. వెంచర్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మహేశ్వరం మండలం మంచన్‌పల్లికి గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ ఏసీబీకి చిక్కి న విషయం తెలిసిందే. తాజాగా వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం మన్నెగూడ గ్రామ సర్పంచ్ వినోద్‌గౌడ్ వెంచర్ యజమాని నుంచి రూ. 13లక్షలు వసూలు చేస్తుండగా గురువారం అవినీతి నిరోదకశాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూడూరు మండలం మన్నెగూడకు చెందిన వినోద్‌గౌడ్ సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. తన గ్రామ పంచాయతీ పరిధిలో వెంచర్ యజమాని నుంచి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. కొంతమేర తగ్గించాలని కోరినా వినలేదు. ఒప్పందం ప్రకారం గురువారం గండిపేట మండలం పరిధిలోని షాదన్ కాలేజీ సమీపంలో రోడ్డుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
వెంచర్ యజమాని నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. మొదటి విడతలో భాగంగా రూ. 13లక్షలు తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయారు. మన్నెగూడ పంచాయతీ ఇటు తాండూరుకు….అటు పరిగి వెళ్లే సెంటర్. అక్కడ భూములకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ ప్రధాన చౌరస్తా కావడంతో మంచి వ్యాపారం జరుగుతోంది. అన్వర్ ఆలంఖాన్ అనే వ్యక్తి ప్రధాన రోడ్డు పక్కనే 20 షర్టర్లు నిర్మిస్తున్నాడు. దీంతో అనుమతి కోసం రూ. 20 లక్షలు ఇవ్వాలని సర్పంచ్ వినోద్‌గౌడ్ డిమాండ్ చేశారు. దీంతో అన్వర్ ఆలంఖాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు శుక్రవారం గండిపేట మండలం పరిధిలోని షాదన్ కాలేజీ సమీపంలో రోడ్డుపై రూ. 13 లక్షలు అన్వర్ ఆలంఖాన్ నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్పంచ్ వినోద్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఉత్తమ సర్పంచే అవినీతి తిమింగలం….
Advertisement
తాజా వార్తలు
Advertisement