ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రముఖ డా.ప్రభు కుమార్ కు ఐఎంఏ డాక్టర్ సీటీ థాకర్ అవార్డు వరించింది. బీహార్ లోని పట్నాలో జరిగిన ఐఎంఏ నాట్కాన్ 82వ వార్షిక సమావేశంలో ఈ అవార్డును ప్రభుకుమార్ కు బహుకరించారు. సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్, కోవిడ్ స్పెషలిస్టుగా ఉన్న డాక్టర్ ప్రభు కుమార్ కు 2020-2021 సంవత్సరంలో కొవిడ్ పేషెంట్స్ కు విశేష సేవలందించారు. అందుకు గాను ఇప్పటికే రెండు జాతీయ అవార్డులను తీసుకున్నారు ప్రభు కుమార్. ఇప్పుడు ముచ్చటగా మూడో అవార్డు రావడం పట్ల ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేఏ జయలాల్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయేష్ లేలే లు ప్రభుకుమార్ ను అభినందించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హైదరాబాద్ బంజారాహిల్స్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముందే జాతీయ స్ఠాయిలో డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డును తీసుకున్నారు ప్రభుకుమార్. కొవిడ్ సమయంలో విధులు నిర్వహించిన తెలంగాణ డాక్టర్ కు నేషనల్ యంగ్ లీడర్ అవార్డు రావడం హర్షణీయం. డాక్టర్ ప్రభు కుమార్ కరోనా పాండమిక్ లో అత్యథిక మంది పేషెంట్లకు వైద్యసేవలందారు. కరోనా పై ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారిని చైతన్యం చేసేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా అనేక ఆర్టికల్స్ రాశారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు అభిమానులే కాదు.. అటు విమర్శకుల ప్రశంసలు పొందారు. బంజారాహిల్స్ ఐఎంఏ ప్రెసిడెంట్, రాపా మెడికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న ప్రభుకుమార్ కు ఇప్పటికే వైద్య రత్న, వైద్య విభూషణ్, వైద్య శిరోమణి, బెస్ట్ డాక్టర్ అవార్డు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డులు వరించిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital