నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో భారత జాతీయ పతాకం ఆవిర్భావం నుంచి జరిగిన మార్పులు, చేర్పులను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జాతీయ పతాకానికి 11 సార్లు మార్పులు జరిగాయని చెప్పారు. స్వాతంత్య్ర పోరాట వీరులను స్మరించుకుంటూ 75 సంవత్సరాల వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గురించి విద్యార్థులకు తెలియజేసేందుకే గాంధీ చిత్రాన్ని ప్రభుత్వం ఉచితంగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నదని వెల్లడిచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement