హైదరాబాద్ : ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ (యుఐటిపి) అవార్డులు-2023 కోసం స్పెయిన్‌లోని బార్సిలోనాలో 2023 జూన్ 4 నుండి 7 వరకు నిర్వహించబడిన యూఐటీపీ గ్లోబల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదస్సులో ఎలివేటింగ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్, ఇండియా పై సమర్పించిన నామినేషన్ ఫైనలిస్ట్‌లలో ఒకటిగా ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్టిఎమ్ఆర్హెచ్ఎల్) ఎంపిక చేయబడిండి. మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ కేటగిరీ కింద వచ్చిన 500 నామినేషన్లలో LTMRHL నామినేషన్ ఫైనలిస్ట్‌లలో ఒకటిగా షార్ట్‌లిస్ట్ చేయబడింది.
ఈ సందర్భంగా L&TMRHL ఎండి & సీఈఓ కె.వి.బి. రెడ్డి మాట్లాడుతూ…. తమ నామినేషన్ ఫైనలిస్ట్‌లలో ఒకటిగా షార్ట్‌లిస్ట్ కావడం తమకు నిజంగా గర్వకారణమన్నారు. హైదరాబాద్‌కు, తమ ప్రయాణీకులకు పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాన్ని అందించడంలో తమ ప్రయత్నాలను గుర్తించినందుకు తాము అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూనే ఉందన్నారు. సురక్షితమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారాలను అందించడానికి అంకితం చేయబడిందన్నారు.