Friday, November 22, 2024

ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్‌ లైసెన్స్‌ను పొందిన లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌

లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన భీమా విభాగం లార్డ్స్‌ మార్క్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇప్పుడు ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్‌ లైసెన్స్‌ను ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నుంచి అందుకుంది.
లార్డ్స్‌ మార్క్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకరింగ్‌ ఇప్పటికే కొన్ని సుప్రసిద్ధ భీమా సంస్ధలతో చర్చలు జరపడంతో పాటుగా వారితో భాగస్వామ్యం చేసుకుని జీవిత, సాధారణ భీమా ఉత్పత్తులను పాలసీ కింగ్‌గా పిలువబడే తమ ప్లాట్‌ఫామ్‌ పై విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఈసంద‌ర్భంగా భీమా రంగంలో ప్రవేశించడం గురించి లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ ఫౌండర్‌ సచిదానంద ఉపాధ్యాయ్‌ మాట్లాడుతూ… భారతీయ భీమా చేరిక తక్కువగా ఉందని, జీవిత, జీవితేతర భీమా పట్ల అవగాహన పెరుగుతుండటం వల్ల వృద్ధి, సేవా డెలివరీ ఆవిష్కరణలకు అపూర్వ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. సంప్రదాయ, సాంకేతికాధికార విధానాలను మిళితం చేయడం ద్వారా త‌మ వినూత్నంగా డిజైన్‌ చేసిన భీమా ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు భీమా కొనుగోలును సౌకర్యవంతంగా మలుస్తుందన్నారు. త‌మ‌ కాంప్లిమెంటరీ ఆరోగ్య భీమా మద్దతు సేవలు, సంప్రదాయ భీమా పంపిణీ వ్యవస్ధలను సమూలంగా మార్చడంతో పాటుగా వినియోగదారుల సేవా కొలమానాలను సైతం పునర్నిర్వచించనున్నాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement