Friday, November 22, 2024

HYD: సోరియాసిస్ నిర్వహణ కోసం టినెఫ్‌కాన్‌ను విడుదల చేసిన లార్డ్స్ మార్క్ బయోటెక్

హైద‌రాబాద్ : లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ, ప్రముఖ హెల్త్‌కేర్, వెల్నెస్ కంపెనీ లార్డ్స్ మార్క్ బయోటెక్, సోరియాసిస్ చికిత్స కోసం పేటెంట్ మెడిసిన్ టినెఫ్‌కాన్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని పిరమల్ లైఫ్ సైన్సెస్ ద్వారా అభివృద్ధి చేయబడిన పేటెంట్ ఉత్పత్తి కోసం ఇన్వెక్స్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రత్యేక ఒప్పందంపై లార్డ్స్ మార్క్ బయోటెక్ సంతకం చేసింది. టినెఫ్‌కాన్‌ సోరియాసిస్‌కు పూర్తి పరిష్కారంగా టాబ్లెట్, క్రీమ్, షవర్ జెల్, స్కాల్ప్ వాష్ వంటి 4 రూపాల్లో అందించబడుతోంది. దీని ధర రూ.799 – రూ. 3900 మధ్య ఉంటుంది.

ఈసందర్భంగా లార్డ్స్ మార్క్ బయోటెక్ ఎండి సచ్చిదానంద్ ఉపాధ్యాయ్ ఈ ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ… టినెఫ్‌కాన్ ని భారత మార్కెట్‌కు పరిచయం చేయడం తమకు సంతోషంగా ఉందన్నారు. టినెఫ్‌కాన్ విడుదల భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రభావాన్ని మెరుగుపరచాలనే తమ లక్ష్యంకు అనుగుణంగా ఉందన్నారు. టినెఫ్‌కాన్ తో, తాము సోరియాసిస్‌కు సమగ్రమైన, సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్సను అందిస్తున్నామన్నారు. సోరియాసిస్ నిర్వహణకు టినెఫ్‌కాన్‌ను ప్రధాన ఎంపికగా ఉంచడం తమ లక్ష్యమన్నారు. తాము భారతదేశంలో టినెఫ్‌కాన్‌ను పెద్ద విజయాన్ని సాధించాలని ఎదురు చూస్తున్నామన్నారు. తాము తమ కార్యకలాపాలను విస్తరింపజేస్తోన్న వేళ విస్తృత స్థాయి లో రోగులకు చేరువయ్యేందుకు ఎదురుచూస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement