కుత్బుల్లాపూర్ : తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారులకు ఎల్లవేళల అండగా ఉంటామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. భౌరంపేట్కి చెందిన ఉద్యమకారుడు కృష్ణతెల్లి భాగ్యమ్మ కాలుకు ఆపరేషన్ అవసరమని నిమ్స్ వైద్యులు సూచించడంతో భాగ్యమ్మ తనయుడు కృష్ణ.. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును కలిశారు. వెంటనే స్పందించిన రాజు రూ. 4 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించి అ లెటర్‌ను కృష్ణకి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్యమకారులకు ఏ ఆపద వచ్చిన పూర్తి సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, తెరాస నాయకులు కస్తూరి బాలరాజ్, పోలీస్ గోవింద్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, రాము, మురళియాదవ్, విష్ణురెడ్డి, శ్రీహరి, ప్రకాష్ , పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement