Friday, November 22, 2024

బావార్చి బిర్యానీలో బల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బావార్చి బిర్యానీలో బల్లి రావడంతో నగరంలోని రాంనగర్‌ కార్పొరేటర్‌ రవిచారి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు బిర్యానీని పరీక్షలకు పంపించి కేసు నమోదు చేశారు. రాంనగర్‌ కార్పొరేటర్‌ శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావార్చి నుంచి బిర్యానీని పార్సిల్‌ తెప్పించుకున్నాడు. సగం తిన్న తర్వాత బిర్యానీలో బల్లి కనిపించడంతో అప్రమత్తమైన అతను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బిర్యానీలో బల్లి కనిపించిందన్న వార్త దావానంలా వ్యాపించడంతో పరిసర ప్రాంతాలలోని యువకులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు.

దీంతో రంగ ప్రవేశం చేసిన జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు అక్కడకు వచ్చి హోటల్‌ను మూసి వేయించారు. ఆందోళనకు దిగిన యువకులను పోలీసులు సముదాయించి అక్కడి నుంచి పంపించి వేయడంతో పరిస్థితి కొలిక్కి వచ్చింది. అయితే నగర వాసులకే కాకుండా, ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాలలోని వారికి బావార్చి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. అలాంటి హోటల్‌ బిర్యానీలో బల్లి వచ్చిందన్న వార్త దావాలనంలా వ్యాపించడం సర్వత్రా చర్చగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement