ఒక్కటే గ్లాసుల గలగల..
తెలంగాణలో వెయ్యి కోట్లు మద్యం విక్రయాలు
రికార్డుల మీద రికార్డులు కొట్టిన లిక్కర్ వ్యాపారం
హార్డ్ డ్రింక్ కంటే సాఫ్ట్ డ్రింక్కే ప్రాధాన్యం
దసరా వేళ బీర్లతోనే చీర్స్ కొట్టారు
రాష్ట్రంలో 17.59 లక్షల కేసుల బీర్ల అమ్మకం
సంతోషం వ్యక్తం చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్
రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు
1171 బార్ అండ్ రెస్టారెంట్లు
10.44 కేసుల మద్యం అమ్మకం
₹1,057.42 కోట్ల ఆదాయం
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పండగ జరిగిన పది రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు, మద్యం దుకాణాలతోపాటు పబ్బుల్లోనూ విక్రయాలు భారీగా పెరిగాయి.
11 రోజుల్లో రూ.1,057.42 కోట్ల అమ్మకాలు
తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోనే భారీ విక్రయాలు జరిగినట్లు అధికారులు గణంకాలు చెబుతున్నాయి. పండుగ చివరి రోజైన శని, ఆదివారాల్లో అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. మొత్తంగా ఈ 11 రోజుల్లో తెలంగాణలో రూ.1,057.42 కోట్ల అమ్మకాలు మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు తక్కువ కాలంలోనే భారీగా ఆదాయం సమకూరింది.
అమ్మకాలు వివరాలు ఇలా ఉన్నాయి…
రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటు పబ్బుల్లోనూ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఏటా దసరా సందర్భంగా మద్యం విక్రయాలు భారీగానే ఉంటాయి. ఈసారి కూడా అదే అంచనాతో ఎక్సైజ్ శాఖ ముందస్తుగా భారీ మద్యం నిల్వలను సిద్ధం చేసింది. దసరా ప్రారంభానికి ముందే అమ్మకాల జోరు మొదలైంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు రూ.1,057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల మద్యం విక్రయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అగ్రస్థానం బీర్లు అమ్మకాలు
రాష్ట్రంలో బీరులు అమ్మకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అదేవిధంగా 17.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పండుగ చివరి మూడు రోజులు అంతకు మించి అమ్ముడుపోయాయి. ఎక్సైజ్ డిపోల నుంచి రూ.205.42 కోట్ల విలువైన మద్యం రిటైల్ షాపులకు చేరింది.