హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో లింగోజీగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగిన విషయం విదితమే. ఇక్కడ్నుంచి పోటీ పెట్టొద్దని మంత్రి కేటీఆర్‌ను బీజేపీ ముఖ్య నేతలు రిక్వెస్ట్ చేయడంతో.. టీఆర్ఎస్ తరఫున ఎవర్నీ పెట్టలేదు. దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవచ్చన్న బీజేపీకి ఊహించని రీతిలో కాంగ్రెస్ షాకిచ్చింది. కాగా, లింగోజిగూడ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి అభ్యర్థి మందుగుల అఖిల్ పవన్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్, జల్ల నాగార్జున, షేక్ ఫర్వేజ్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దర్పేల్లి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ తాజా విజయంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేట్ల సంఖ్య మూడుకు చేరుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement