చిన్నారులు, యువతపై దృష్టి కేంద్రీకరించిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్రాండ్ లిల్ గుడ్‌నెస్ భారతదేశపు మొట్టమొదటి రెడీ టు సర్వ్ ప్రీబయాటిక్ మిల్క్‌షేక్ – ప్రీబయాటిక్ బ్రేక్ షేక్ (బ్రేక్‌ఫాస్ట్ షేక్) ను విడుదల చేసింది. ప్రీబయాటిక్ బ్రేక్ షేక్ విడుదల సందర్భంగా లిల్ గుడ్‌నెస్ ఫౌండర్ హర్షవర్థన్ ఎస్ మాట్లాడుతూ…. కృత్రిమ పదార్ధాల వినియోగం వీలైనంతగా తగ్గించి ఆరోగ్యవంతమైన, అత్యుత్తమ అవకాశాలు అందించడం ద్వారా చిన్నారులు, పెద్దలకు ఆరోగ్యవంతమైన పదార్థాలను అందించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ప్రీబయాటిక్ మిల్క్‌షేక్‌ను ఇండియాలో విడుదల చేశామన్నారు. పేగు ఆరోగ్యం, సూక్ష్మ పోషకాల పోర్టిఫికేషన్ అనేది అందుబాటు ధరల్లో అందించడమనేది తమకు అత్యంత కీలకమైన అంశమన్నారు. తమ మార్కెట్ పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ విభాగంలో గణనీయమైన అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా బేవరేజ్ విభాగంలో ఈ అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. పాఠశాలలు, ఆఫీసులు పూర్తిగా తెరుచుకుంటుండటంతో దీనిని ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన బేవరేజ్ స్నాక్‌గా సృష్టించాలనుకుంటున్నామన్నారు. మార్కెట్ అధ్యయనాల ప్రకారం వదులుకోలేనిట్టి రుచులను అత్యంత అందుబాటు ధరల్లో అందించనున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement