హైదరాబాద్, – 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, ఎల్ఐసి సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో జోనల్ మేనేజర్ పునీత్ కుమార్, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం, ఉద్యోగులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు మరియు ఏజెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు
. భారతదేశం గణతంత్రంగా మారిన తర్వాత చేసిన ప్రస్థానంపై చర్చించి, జాతీయ ఐక్యత మరియు దేశ వేగవంతమైన అభివృద్ధి ప్రాముఖ్యతను గుర్తు చేశారు జీవిత భీమా సంస్థ లో సాంకేతిక పరిజ్ఞానం పాలసీదారులకు ఉత్తమ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వినియోగదారుల కోసం అత్యల్ప సమయంలో సేవలను అందించే అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, మనుషుల మధ్య పరస్పర సంబంధం మరింత విలువైనదిగా మారిందని, దీన్ని మర్చిపోవద్దని స్పష్టం చేశారు.
సమాజంలో మారుతున్న ఆర్థిక-సామాజిక పరిస్థితులలో జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అందరి భాగస్వామ్యం అవసరమని అన్నారు సంస్థ ఏజెంట్లు మరియు ఉద్యోగులు నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు, ఎందుకంటే అదే దేశాన్ని బలపరిచే మార్గమని అభిప్రాయపడ్డారు.
.ఈ కార్యక్రమంలో సతీష్ బాబు, రాజేష్ భరద్వాజ్, ఉత్తప్ జోసెఫ్, శ్రీమతి సరస్వతి గోపాకుమార్, ఆర్ ఎల్ ఎన్ స్వామి, శ్రీప్రమోద కుమార్ సహూ మరియు ఇతర సీనియర్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.