Tuesday, September 17, 2024

LG: ప్రత్యేకమైన ఇండిపెండెన్స్ డే ఆఫర్లు ప్రకటించిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్…

హైద‌రాబాద్: భారతదేశపు ప్రముఖ గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్జీ తమ ఉత్పత్తులపై ఉత్తేజభరితమైన ఆఫర్లతో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు జరుపుతోంది. ఈ ఉత్తేజభరితమైన ఆఫర్లు అతుల్యమైన డీల్స్ అండ్ డిస్కౌంట్ల ద్వారా ఎల్జీ ఉత్పత్తుల విస్తృత శ్రేణిపై స్వాతంత్ర్యం స్ఫూర్తికి చిహ్నంగా నిలిచాయి. ఫ్రీడమ్ ఆఫర్లలో భాగంగా, కస్టమర్లు 26శాతం వరకు క్యాష్ బాక్ లేదా గరిష్టంగా రూ. 40,000 వరకు డిస్కౌంట్లను ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఆనందించవచ్చు.

ఎల్జీ వారి వినూత్నమైన, ఉన్నతమైన నాణ్యతా ఆఫరింగ్స్ తో తమ ఇళ్లను అప్ గ్రేడ్ చేయడానికి పరిపూర్ణమైన సమయంగా మార్చింది. ఈ సేల్ లో లైఫ్స్ గుడ్ ఆఫర్స్ కూడా భాగంగా ఉన్నాయి. దీనిలో కస్టమర్లు ఎంపిక చేయబడిన ఎల్జీ టీవీల పై 3సంవత్సరాల వారంటీ పొందగలరు. ఓఎల్ఈడీ ఆఫర్ల ద్వారా రూ 50,000 వరకు విలువ గల ప్రయోజనాలు ఆనందించవచ్చు. ఎంపిక చేసిన ఎల్టీ టీవీలతో కొనుగోలు చేసినప్పుడు సౌండ్ బార్స్ 30శాతం వరకు డిస్కౌంట్ తో లభిస్తాయి. ఎల్జీ ఎక్స్ బూమ్ ఎంపిక చేసిన మోడల్స్ పై ఉచిత మైక్ కూడా చేర్చబడింది.

ఈసంద‌ర్భంగా ఎల్జీ ఎల‌క్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ హాంగ్ జు జియాన్ మాట్లాడుతూ… భారతదేశపు ప్రముఖ వినియోగదారు మన్నికైన బ్రాండ్ గా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రత్యేకమైన ఆఫర్లతో సంబరం చేయడానికి ఆనందిస్తోందన్నారు. ఎల్జీ సరికొత్త ఉత్పత్తి శ్రేణితో తమ ఇళ్లను మెరుగుపరిచే ఉత్తేజభరితమైన అవకాశాన్ని తాము త‌మ కస్టమర్లకు అందిస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement