Friday, September 20, 2024

HYD: లైఫ్స్ గుడ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాంను ప్రకటించిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్

హైదరాబాద్: భారతదేశపు ప్రముఖ వినియోగదారు డ్యూరబుల్ బ్రాండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్, తమ ఫ్లాగ్ షిప్ సీఎస్ఆర్ చొరవ లైఫ్స్ గుడ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాంను ప్రకటించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా నోయిడాలోని తమ కార్పొరేట్ కార్యాలయంలో విజయవంతంగా తమ ఫ్లాగ్ షిప్ ఉపకారవేతనం ప్రోగ్రాం మొదటి ఎడిషన్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఎండీ – ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 3 సంస్థలు నుండి స్కాలర్స్ ను సన్మానించింది. గల్గోటియా యూనివర్శిటీ, జైపూరియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లాయడ్ లా కాలేజీ.

ఈసందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎంజీ హాంగ్ జు జియాన్ మాట్లాడుతూ… తమ నిబద్ధత వినూత్నమన ఉత్పత్తులు, సేవలను అందించడానికి మించి ఉందన్నారు. అర్థవంతమైన చొరవల ద్వారా ప్రజల జీవితాల్లో వాస్తవమైన మార్పును కలిగించడానికి తాము కృషి చేస్తామన్నారు. ఆరోగ్యం అండ్ పోషకాహారం, విద్య అండ్ నైపుణ్యం వంటి వాటిపై తాము దృష్టిసారించే కీలకమైన సీఎస్ఆర్ ప్రయత్నాలుగా ఉన్నాయన్నారు. సామాజిక ప్రగతికి అండ్ ఆర్థిక సాధికారత విద్య అనేది ప్రాథమికం అని తాము విశ్వసిస్తామన్నారు.

- Advertisement -

బడ్డీ 3 స్టడీ స్థాపితులు అండ్ సీఈఓ అషుతోష్ బర్నవాల్ మాట్లాడుతూ…. లైఫ్స్ గుడ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం ద్వారా విద్యను మద్దతు చేయడానికి తమ నిబద్ధత కోసం తాము ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాను ఎంతగానో ప్రశంశిస్తామన్నారు. బడ్డీ4 స్టడీలో, తాము ఈ చొరవపై సహకరించడానికి గర్విస్తున్నామన్నారు. ఇది అర్హత గల విద్యార్థులకు సాధికారత కలిగిస్తుందన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులు తమ విద్యాపరమైన కలలు సాకారం చేయడానికి తోడ్పడుతుందన్నారు. భారతదేశం వ్యాప్తంగా ఉన్న ప్రతిభ గల యువత మార్గంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా నిర్థారించడంలో ఈ ప్రోగ్రాం ఒక కీలకమైన చర్య అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement