హైదరాబాద్, ఆంధ్రప్రభ : మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం చిరుత సంచారం కలకలం రేపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల చిరుత సంచరిస్తుండగా కొందరు ఆ దృశ్యాలను వీడియో తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు స్పాట్‌కు చేరుకుని చిరుత సంచారంపై ఆరా తీసి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.
కాగా మియాపూర్ మెట్రో పరిసర ప్రాంతంలో కనిపించింది లియోపార్డ్ గానీ జాగ్వార్ గానీ అయి ఉండొచ్చని చీతా కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మన దేశంలో చీతాలు కేవలం వైల్డ్ ఫారెస్ట్‌ల్లో మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చారు. అది ఏ జాతి పులి అయినప్పటికీ మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సంచరించడం నగరవాసుల్లో భయాందోళనకు కారణమైంది. స్థానికులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.