ఆంధ్రప్రదేశ్ లోని లీడ్ పవర్డ్ స్కూల్స్ లలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో, కోవిడ్ సంబంధిత సవాళ్లు ఉన్నా సరే, దాదాపు 20 శాతం మేర స్టూడెంట్ అభ్యసన ఫలితాలను మెరుగు చేయగలిగింది. ఆంధ్రప్రదేశ్ లోని 240కి పైగా స్కూళ్లలో లీడ్ ఇంటెగ్రేటెడ్ స్కూల్ సిస్టం ఇప్పటికే అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో 90,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. అంతకుమించి 2500 మందికి పైగా టీచర్లు ఇప్పటికే లీడ్ ద్వారా శిక్షణ పొంది సర్టిఫై అయ్యారు. ఈసందర్భంగా లీడ్ కో ఫౌండర్, సీఈఓ సుమీత్ మెహతా మాట్లాడుతూ… ఇండియాలో ప్రతి చిన్నారి ప్రతిరోజు స్కూళ్లలో ఆరు నుండి ఏడు గంటలు గడుపుతారన్నారు. అయినప్పటికీ వీరిలో కొందరికి మాత్రమే మెట్రో నగరాల్లో ఉన్న అధిక ఫీజులు చెల్లించే స్కూల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల విద్యను పొందగలుగుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా తమ లీడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టం ద్వారా స్కూళ్లకు సాధికారిక అందించడం ద్వారా మార్పు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
లీడ్ గురించి విశాఖపట్నం భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపల్ కుమారి షింపి మాట్లాడుతూ… భారతీయ విద్యా భవన్ వైజాగ్ లో 1994లో ఏర్పాటు కాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని అగ్రగ్రామి స్కూళ్ళలో ఒకటిగా నిలిచిందన్నారు. శ్రీ శ్రీజ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కర్నూల్, స్టూడెంట్స్ అయిన ఇషాన్, గగన్ తల్లిదండ్రులైన నవ్య, నరేష్ లు మాట్లాడుతూ… తమ పిల్లలు చదువుతున్న, ప్రదర్శిస్తున్న విధానంలో తాను సానుకూల మార్పును చూడగలిగానన్నారు. యాక్టివిటీ ఆధారిత బోధన ద్వారా పిల్లలు నేర్చుకునే పద్ధతి చాలా బాగుందన్నారు.