Friday, November 22, 2024

HYD: ఒరాఫో జ్యుయల్స్ ఇ-స్టోర్ ఆవిష్కరణ

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మొదటి వెండి ఆభరణాల బ్రాండు ఒరాఫో జ్యుయల్స్. 2018 లో ఒరాఫో వారి మొదటి షోరూం సోమాజిగూడ, హైదరాబాద్ వద్ద ప్రారంబించారు. 92.5 విలువైన వెండి ఆభరణాల ఉత్పత్తులను ఒరాఫో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నది. ఒరాఫో గత అయిదు సంవత్సరాలుగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పురోగమిస్తున్నది. ప్రతి వేడుకకు ప్రతి మహిళ కోరుకునే అద్భుతమైన కళాత్మకతతో రూపొందిన వెండి ఆభరణాలు అందించాలనే అభిలాషతో సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద రెండవ షోరూం, ఏఎస్.రావు నగర్ మెయిన్ రోడ్ వద్ద మూడవ షోరూం ఒరాఫో ప్రారంభించటం జరిగినది.

ఈసందర్భంగా ఒరాఫో జ్యుయల్స్ డైరక్టర్ కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… 5 ఏళ్ల క్రితం కస్టమైజ్డ్ డిజైనర్ విలివైన ఆభరణాలు కొనుగోలు చేసే నూతన విధానానికి తెరతీశామ‌న్నారు. ఇప్పుడు ఏఎస్ రావు నగర్ మెయిన్ రోడ్, హైదరాబాద్ లోని త‌మ మూడవ షోరూం ద్వారా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ అంతటా ఫ్రాంచైజీ పద్దతిలో త్వరలో ప్రత్యేక షోరూంలు ప్రారంభిస్తామని తెలిపారు. బంగారం ధరలు పెరగటం, ఖాతాదారుల ఆర్ధిక వ్యవస్తను దెబ్బతీయడం వంటి కారణాలతో వెండి ఆభరణాలకు బాగా గిరాకి పెరిగిందన్నారు. ఒరాఫో గత అయిదు సంవత్సరాలుగా ఏటా 25శాతం స్థిరమైన వృద్ధిని సాదిస్తుంద‌న్నారు. వెండి ఆభరణాల విభాగాలో ఒరాఫో సుస్థిరతను బ్రాండ్ ఇమేజ్ సాధించింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement