Tuesday, November 19, 2024

సికింద్రాబాద్‌లో మెడికవర్‌ ఫెర్టిలిటీ

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది సంతోషకరమైన రోగులతో పాటుగా భారతదేశం సహా 13దేశాల్లో 3వేలకు పైగా క్లీనిక్స్‌ కలిగిన మెడికవర్‌ ఫెర్టిలిటీ ఇప్పుడు సికింద్రాబాద్‌కు వచ్చింది. తద్వారా సికింద్రాబాద్‌తో పాటుగా దగ్గరలోని ప్రాంతాల్లో పిల్లలు లేని దంపతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను చూపనుంది. మెడికవర్‌ ఫెర్టిలిటీ తమ క్లీనిక్‌ను సికింద్రాబాద్‌లో మన్‌మోహన్‌ శర్మ (మేనేజింగ్‌ డైరెక్టర్‌, మెడికవర్‌ ఫెర్టిలిటీ), డాక్టర్‌ రునా ఆచార్య (సీనియర్‌ ఐవీఎఫ్‌, కన్సల్టెంట్‌, మెడికవర్‌ ఫెర్టిలిటీ ), సందీప్‌ సోనీ (బిజినెస్‌ హెడ్‌ – సౌత్‌ ) సమక్షంలో ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా మన్‌మోహన్‌ శర్మ మాట్లాడుతూ… భారతదేశంలో ప్రతి ఆరు జంటల్లో ఒకటి తమ పునరుత్పత్తి వయసులో సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వారు తగిన సమయానికి నిపుణులను సంప్రదిస్తే, వారు గర్భం దాల్చేందుకు ఉన్న అవకాశాలు మెరుగుపడతాయన్నారు. డాక్టర్‌ రునా ఆచార్య మాట్లాడుతూ… సంతానలేమితో బాధపడుతున్న జంటలకు అనుకూలీకరించిన సంతానోత్పత్తి చికిత్సలను అందించే అవకాశం అందిస్తున్నామన్నారు. ఇది వారికి లబ్ధి కలిగిస్తుందని వెల్లడించారు. అదనంగా, రోగులు వాయిదా పద్ధతిలో 0శాతం వడ్డీ రేటుతో ఫీజులు చెల్లించే అవకాశం కూడా కల్పిస్తున్నార‌న్నారు. గత 26 సంవత్సరాలుగా, మెడికవర్‌ ఫెర్టిలిటీ ఎంతోమందికి మాతృత్వం పొందడంలో సహాయపడిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement