Tuesday, September 17, 2024

HYD: సెప్టెంబర్ 12న సోనీ లైవ్ లో తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘బెంచ్ లైఫ్’

హైదరాబాద్: కార్పొరేట్ వెట్టిచాకిరీకి సంబంధించి తరచుగా ఒత్తిడితో కూడిన ప్రపంచాన్ని బెంచ్ లైఫ్ తాజాగా, ఉల్లాసంగా అందిస్తుంది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ కామెడీ-డ్రామా అందరినీ ఎంతగానో నవ్విస్తుంది. కేవలం పనిలేకుండా కూర్చోవడమే కాదు-ఇది కొత్త అభిరుచులను కనుగొనడం, అసలేమాత్రం ఊహించని ప్రదేశాల్లో ఏదో ఒక ప్రయోజనాన్ని కనుగొనడం ఇందులో ఉంటాయి.

ఈ సందర్భంగా బెంచ్ లైఫ్ నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ… కార్పోరేట్ బెంచ్‌లో ఉన్న ప్రత్యేకమైన అనుభవాన్ని చూపించే ఒక షోను రూపొందించాలనుకున్నామన్నారు. బెంచ్ పై ఉండడం అనేది ఉద్యోగులు తరచుగా ఏదో కోల్పోయినట్లు, అనిశ్చితంగా భావించే ప్రదేశమన్నారు. కానీ ఎన్నో అనుకోని పరిస్థితుల్లో కూడా, జీవితంలో వృద్ధి చెందే, కలలు నెరవేరే అవకాశాలు ఉన్నాయని బాలు, మీనాక్షి, ఇషా, రవి, అతని స్నేహితుల ద్వారా తాము చూపిస్తున్నామన్నారు. బెంచ్ లైఫ్ అనేది తిరిగి కోలుకోవడం, స్నేహం, ఆనందాన్ని వేడుక చేసుకోవడమన్నారు.

ఈ ధారావాహికలో వైభవ్ రెడ్డి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, చరణ్ పేరి వంటి నటీనటులతో పాటు రాజేంద్ర ప్రసాద్, తులసి, తనికెళ్ల భరణి వంటి ప్రముఖ నటులు నటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రానికి పి.కె. దండి తన సంగీతంతో జీవం పోశారు. సినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్. బెంచ్ లైఫ్ సెప్టెంబర్ 12 నుండి ప్రత్యేకంగా సోనీ లైవ్ లో ప్రసారం కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement