Tuesday, November 26, 2024

సింబయోసిస్‌ యుజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల న‌మోదుకు.. ఏప్రిల్‌ 12 చివ‌రి తేదీ

హైద‌రాబాద్, మార్చి 23 (ప్ర‌భ న్యూస్) : సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ (డీమ్డ్‌ యూనివర్శిటీ) (ఎస్‌ఐయు)లో సింబయోసిస్‌ ప్రవేశ పరీక్ష (ఎస్ఈటీ) 2023 మే 6 నుంచి 14 వరకూ జరుగనుందని యూనివర్శిటీ వెల్లడించింది. పలుమార్లు ఈ ప్రవేశపరీక్షలలో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎస్‌ఐయు పరిధిలోని 16 ఇనిస్టిట్యూట్‌లలో అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను పొందే అవకాశముంది. ఈ ప్రోగ్రామ్‌లలో మేనేజ్‌మెంట్‌, లా, ఇంజినీరింగ్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, ఎకనామిక్స్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, ఐటీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, అప్లయ్డ్‌ స్టాటిస్టిక్స్‌, డాటా సైన్స్‌లో చేరవచ్చు. సెట్‌ (సింబయోసిస్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ) 2023 ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 12 ఏప్రిల్‌.

ఈసంద‌ర్భంగా సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ (డీమ్డ్‌ యూనివర్శిటీ) వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రజనీ గుప్తే మాట్లాడుతూ… మన దేశ విద్యావిధానాన్ని సమూలంగా జాతీయ విద్యావిధానం 2020 మార్చనుందన్నారు. అభివృద్ధి, సౌకర్యం, నూతన తరపు అభ్యాస పరంగా నూతన శిఖరాలకు ఇది తీసుకువెళ్లనుందన్నారు. సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీ వద్ద తాము ఇప్పటికే ఎన్‌ఈపీ 2020 నిర్ధేశించిన లక్ష్యాలకనుగుణంగా కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. త‌మ పలు ప్రోగ్రామ్‌లను సమగ్రమైన, మల్టీడిసిప్లీనరీ విద్యను విద్యార్దులకు అందించనున్నాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement