Tuesday, November 19, 2024

కెటిఆర్ టార్గెట్ 7/7….

ఇప్పటికే ఖమ్మం, వరంగల్‌ నగరాల్లో పర్యటన
నేడు అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్లకు… షెడ్యూల్‌కు రంగం సిద్ధం

హైదరాబాద్, : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మునిసిపల్‌ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు కార్పోరేషన్లు, మునిసిపాలిటీలపై గురిపెట్టారు. ఏడుకు ఏడుపురపాలికలు కైవసం చేసుకునేలా పురశంఖారావం పూరించి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అటు అభివృద్దితో ప్రజలకు భరోసా నిస్తూ.. ఆశలు కల్పిస్తూ, ఇటు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్‌ ముని సిపల్‌ కార్పోరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొతూ ్తరు, అచ్చంపేట, నకిరేకల్‌ మునిసిపా లిటీల ఎన్నికల నిర్వ హణకు ఈ నెల 17న షెడ్యూల్‌ వెలువడే అవకాశ ముండగా, 30న పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు దీనిపై సంకేతాలివ్వగా, షెడ్యూల్‌కు సంబంధించిన సన్నాహాలపై ముందుగా ఆంధ్రప్రభలో ప్రత్యేకకథనం ప్రచురితమైన విషయం విదితమే. మునిసిపల్‌ శాఖామంత్రిగా గత మునిసిపల్‌, కార్పోరేషన్‌ ఎన్నికల్లో పార్టీకి అపూర్వ విజయాలు అందించిన కేటీఆర్‌.. ఇపుడు జరగనున్న ఏడు పురపాలికలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టి పనిచేస్తున్నారు. కేటీఆర్‌ పర్యటన తర్వాత ఆయా నగరాలు, పట్టణాల్లో రాజకీయం మారుతుండగా, పార్టీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఎలక్షన్‌ మూడ్‌లో పనిచేసుకుంటూ వెళుతున్నారు.
గులాబీ శ్రేణుల్లో జోష్‌
ఖమ్మం, వరంగల్‌లలో కేటీఆర్‌ పర్యటనలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సా హాన్ని కలిగించాయి. ఆయా నగరాల్లోని సభల్లో కార్పోరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ బహిరంగంగా పిలుపునిచ్చారు. ఖమ్మంలో 60డివిజన్లు ఉండగా 60కు 60 సాధిం చాలన్న పట్టుదలతో రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పనిచేస్తున్నారు. వరంగల్‌ కార్పోరేషన్‌లో 66స్థానాలు ఉండగా, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, నన్నపనేని నరేందర్‌లో స్వీప్‌ చేయాలని శ్రమిస్తున్నాయి. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ విజ యానికి ఇప్పటికే ప్రత్యేకప్రణాళిక రూపొందించుకుని మిషన్‌-24 అంటూ తన నియోజకవర్గ పరిధిలోని ప్రతీ డివిజన్‌ గెలుచుకోసం ఎజెండా రూపొందించుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు ఇక్కడ పనిచేస్తున్నారు. పాలమూరులోని మూడు మునిసి పాలిటీలు అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్లలోనూ స్వీప్‌ లక్ష్యంగా నేతలు ఫైట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవ ర్గాల ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మంత్రి కేటీఆర్‌ వరాలజల్లు కురిపిస్తూ, అభి వృద్దికి భరోసానిస్తుండడంతో ప్రజలలో పర్యటన సందర్భ ంగా హర్షధ్వనాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట మునిసిపాలిటీపై ఆర్ధికశాఖా మంత్రి హరీష్‌రావు ఇప్పటికే గురిపెట్టి.. పనిచేస్తుండగా, అక్కడ విజయం నల్లేరుపై బండి నడకేనని భావిస్తున్నారు. నకిరేకల్‌ లోనూ పాగా వేసేందుకు.. ముమ్మర ప్రచారం చేస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సీఎం పిలిపించుకుని ఎన్నికల వ్యూహాలు, ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలుపుకుని వెళ్ళాలని సూచించినట్లు తెలిసింది.
నేడు కేటీఆర్‌ పర్యటన
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పురపాలికలకు త్వరలో ఎన్నికల నగారా మోగనున్న వేళ పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆ రెండు పట్ణణాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరనున్న కేటీఆర్‌ తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. జడ్చర్ల మినీ ట్యాంక్‌బండ్‌, మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ను ప్రారంభిస్తారు. కావేరమ్మపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను పరిశీలిస్తారు.
జడ్చర్లలో సభ ముగిసిన తర్వాత మంత్రి అచ్చంపేటకు వెళ్లనున్నారు. అక్కడ రూ.5 కోట్లతో నిర్మించ తల పెట్టిన అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రం, 8 కోట్లతో సమీకృత మార్కెట్‌, రూ.75 లక్షలతో మార్కెట్‌ యార్డు ప్రహారీ గోడ నిర్మాణం, రూ.2 కోట్లతో స్మృతివనంలో, రూ.10 కోట్లతో పురపాలికలో అభివృద్ధి పనులు, ఇండోర్‌ స్టేడియం అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అచ్చంపేట ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement