హైదరాబాద్ : మంత్రి కెటిఆర్…సామాన్యునిలా ఉండే ఆయన ఎవరికి ఏ సాయం కావలసినా ఒక్క ట్విట్ చేస్తే చాలు వెంటనే స్పందించేస్తారు.. దీనికోసం తన ట్విట్టర్ ఖాతాను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక టీమ్ నే ఏర్పాటు చేసుకున్నారు.. కరోనా సమయంలో ఆయన ట్విట్టర్ ఖాతాలో సాయం కోరుతూ చేసిన ప్రతి ట్విట్ కి స్పందించి మానవతా గుణాన్ని చాటుకున్నారు..ప్రస్తుతం ఆయనే కరోనా పాజిటివ్ తో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.. అయినా తన సేవా గుణం మరిచిపోలేదు.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ యువతి కొవిడ్ భారిన పడి ఆస్పత్రిలో చేరింది. తమ సోదరి స్థితిని వివరిస్తూ గుప్తా అనే ట్విట్టర్ తమకు రెమ్‌డెసివిర్ డ్రగ్ కావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విన్నవించాడు. దయచేసి ఆంధ్రా ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరాడు. దీనిపై తక్షణం స్పందించిన మంత్రి కేటీఆర్ తన స్నేహితుడు, ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ మీకు సహాయం చేయనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ బాధితులకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించారు. దీనిపై బాధితుడు స్పందిస్తూ ఇరు రాష్ట్రాల మంత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. తెలంగాణ, ఆంధ్రా బేదం భావం లేకుండా ఆపదలో ఉన్నా అంటే చాలు నేనున్నా అని ధైర్యం చెప్పి సహాయం చేసేవాడే మా కేటీఆర్ అన్న అని నెటిజన్లు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కెటిఆర్ ట్విట్టర్ ఖాతాలో నిత్యం వందకు పైగా సాయం కోసం ట్విట్లు వస్తున్నాయి.. వాటన్నింటిని పరిష్కరిస్తూ కెటిఆర్ మర్యాద రామన్నగా మన్ననలు పొందుతున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement