హైదరాబాద్ – కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్రంలో బీజేపికి అలవాటుగా మారిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరతే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కూడా బీజేపీ మంగళం పాడుతోందని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అన్నది విభజన చట్టంలో తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగ బద్ధమైన హక్కన్నారు . కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకోసం 150 ఎకరాల విలువైన భూమిని సేకరించి కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రానికి అప్పగించామని తీరా ఇప్పుడు ఫ్యాక్టరీ లేదని చెబుతున్నారని మండిపడ్డారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు రానున్నపార్లమెంటు సమావేశాల్లో ఆందోళనలు చేస్తారని కేటీఆర్ తెలిపారు. హై స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ రైళ్ల విషయంలోనూ తెలంగాణకు కేంద్రం అన్యాయమే చేసిందన్నారు. రైల్వేల ప్రైవేటీకరణ కోసం కేంద్రం ఎత్తులు వేస్తోందని ఇది జాతి వ్యతిరేక చర్యనీ కేటీఆర్ అన్నారు. : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు
Advertisement
తాజా వార్తలు
Advertisement