Wednesday, November 20, 2024

అసైన్డ్, దేవాల‌యాల భూములు కొన‌కూడ‌ద‌ని మీకు తెలీదా – ఈట‌ల‌కు మంత్రి కొప్పుల కౌంట‌ర్

హైద‌రాబాద్ : పేద‌ల‌కు, ద‌ళితుల‌కు ప్ర‌భుత్వం కేటాయించిన‌ భూమిని కొన‌కూడ‌ద‌ని మంత్రిగా ఈట‌ల‌కు తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు మంత్రి కొప్పులు ఈశ్వ‌ర్… గ‌త రెండు రోజులుగా ఈట‌ల ప్రెస్ మీట్ల‌పై పెద‌వి విప్ప‌ని టిఆర్ ఎస్ మంత్రులు నేడు నేరుగా ఈట‌ల‌ను కౌంట‌ర్ చేశారు.. ఈ నేప‌థ్యంలో టిఆర్ ఎస్ పార్టీ కేంద్ర‌ కార్యాల‌యంలో మంత్రి కొప్పులు మీడియాతో మాట్లాడుతూ, ఈట‌ల‌పై విరుచుకుప‌డ్డారు 66 ఎక‌రాల అసైన్డ్ భూమిని వ్యాపార విస్త‌ర‌ణ కోసం కొనుగోలు చేసిన‌ట్లు ఈట‌లే చెప్పారు అని గుర్తు చేశారు. ఈట‌ల‌కు వ్యాపార‌మే ముఖ్యమ‌ని,బీసీలు, ఎస్సీల స్థితిగ‌తులు ప‌ట్ట‌వు అని చెప్పారు. ఎక‌రం కోటిన్న‌ర ప‌లికే భూమిని రూ. 6 ల‌క్ష‌ల‌కే కొనుగోలు చేశార‌న‌న్నారు. దేవ‌ర‌యాంజ‌ల్‌లో దేవాల‌య భూముల‌ను కూడా కొనుగోలు చేశార‌ని అంటూ. దేవాల‌య భూముల‌ని తెలిసి కూడా ఎందుకు కొనుగోలు చేశారు? అని ప్ర‌శ్నించారు. పార్టీ ద్వారా అనేక ర‌కాలుగా ఈట‌ల ల‌బ్ధి పొందారు. మీకు ఏదో అన్యాయం జ‌రిగింద‌ని సీఎంపై దాడి చేయ‌డం త‌గ‌దు అని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్ప‌డిన త‌ర్వాత 2003లో ఈట‌ల రాజేంద‌ర్ పార్టీలో చేరార‌న్నారు. పార్టీలో ఈట‌ల చేర‌క‌ముందే ఉద్య‌మం ఉధృతంగా ఉంద‌న్నారు. ఉద్య‌మ కాలంలోనూ ఈట‌ల‌ను కేసీఆర్ అన్ని విధాలా గౌర‌వించి ప్రాధాన్య‌త ఇచ్చారు అని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement