ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం – 2022 సందర్భంగా కూ(Koo) యాప్ వినియోగదారుల హక్కులకు విస్తృత దృక్పథంతో సోషల్ మీడియాలో వినియోగదారు రక్షణ, ప్రైవసీ ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సోషల్ మీడియా మధ్యవర్తిగా – సోషల్ మీడియా వినియోగదారులను శక్తివంతం చేయడం, సృజనాత్మకతను పెంపొందించడం, సానుకూల, ప్రగతిశీల డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో వినియోగదారు ప్రైవసీ, భద్రత పోషించే కీలక పాత్రను కూ(Koo) నొక్కి చెప్పింది.
కూ(Koo) పారదర్శక ప్రైవసీ పాలసీ ప్లాట్‌ఫారమ్‌లో పరస్పర చర్య చేస్తున్నప్పుడు వినియోగదారులకు హక్కులు కలిగి ఉంటుంది. ఈ హక్కుల్లో వినియోగదారు గురించి ప్లాట్‌ఫారమ్ లో ఉన్న సమాచారాన్ని తెలుసుకునే హక్కు, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ సమాచారాన్ని సరిదిద్దడానికి, నవీకరించడానికి లేదా సవరించడానికి హక్కు, ఇతర కీలక హక్కులతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని అనవసరమైనప్పుడు రద్దు చేసే లేదా తొలగించే హక్కును కలిగి ఉంటుంది. అదే సమయంలో, ఆన్లైన్ లో వినియోగదారు భద్రతను పెంపొందించడానికి, కూ(Koo) నిర్మాణాత్మకమైన కమ్యూనిటీ గైడ్‌లైన్స్, కంటెంట్ మోడరేషన్ గైడ్‌ని కలిగి ఉంది. ఇవి భారతీయ తత్వానికి అనుగుణంగా ఉంటాయి. క్రియేటర్లను, మొదటిసారిగా సోషల్ మీడియా వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడం ద్వారా మరింత ఆరోగ్యకరమైన కంటెంట్‌ను రూపొందించడంలో వారికి అధికారం ఇస్తాయి. స్థానిక భారతీయ భాషల్లో స్వీయ-వ్యక్తీకరణ కోసం అతిపెద్ద ప్లాట్‌ఫారమ్, కూ(Koo) – ఇది 20 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి ఉంది.