కూ ఫిలాసఫీ, దాని ప్రధాన అల్గారిథమ్‌ల వెనుక పనిచేసే మొదటి ముఖ్యమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంగా మారింది. ఈ చర్య యూజర్ ఆసక్తులను ప్రధానంగా ఉంచుతూ, ప్లాట్‌ఫాం పారదర్శకత, తటస్థతకు కూ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈసందర్భంగా కూ (koo) సహ వ్యవస్థాపకుడు అండ్ CEO అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ… సోషల్ మీడియాలో పారదర్శకత, నమ్మకాన్ని ప్రోత్సహించడంలో కూ ముందంజలో ఉందన్నారు. తమ అల్గారిథమ్‌లు ఎటువంటి జోక్యం, పక్షపాతం లేకుండా పని చేస్తాయన్నారు. తమ అల్గారిథమ్‌ల గురించి బహిరంగంగా మాట్లాడటమనేది కూ(koo)లో దాచిన ఎజెండాలు లేవని వినియోగదారులకు తెలియజేయడానికి తమ నిబద్ధతలో భాగమన్నారు. తమ అల్గారిథమ్‌లతో పాటు, తమ విధానాలన్నీ తమ వెబ్‌సైట్‌లో బహుళ భాషల్లో వివరించబడ్డాయన్నారు. కూ(koo) సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా మాట్లాడుతూ… తాము తమ ప్రధాన వాటాదారులు – వినియోగదారులు, సృష్టికర్తలపై చాలా దృష్టి పెడుతున్నామన్నారు. సరైన సృష్టికర్తలను కనుగొనడంలో వినియోగదారులకు సహాయం చేయడం ముఖ్యమన్నారు. తమ అల్గారిథమ్‌లు దీన్ని సాధించడంలో సహాయపడతాయన్నారు. వినియోగదారు ఔచిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక అనుభవాలను వ్యక్తిగతీకరించాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement