హైదరాబాద్, : రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ అవుతుం దనుకుంటే చావుల తెలంగాణగా మారిందన్నారు. కరోనా కేసులను, మరణాల విషయంలో ప్రభుత్వం వాస్తవాలను చెప్పడం లేదని ఆయన మండి పడ్డారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకు కరోనా విస్తరిస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చుతామని సీఎం కేసీఆర్ అసెంబ్లి లో చేసిన ప్రకటనకు కూడా విలువలేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ లేకపోవడంతో ప్రయివేట్ ఆసుపత్రులక వెళ్లితే రోజుకు రూ. లక్ష ఖర్చవుతుందని, ఈ ఖర్చును భరించడం పేద ప్రజలకు కష్టంగా మారిన విషయాన్ని సీఎం కేసీఆర్ గమనించాలని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.
బంగారు తెలంగాణ కాదు…. చావుల తెలంగాణః ఎంపి కోమటిరెడ్డి
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement