Tuesday, November 26, 2024

క‌రోనా క‌ట్ట‌డిలో కెసిఆర్ స‌ర్కార్ పూర్తిగా విఫ‌లం – కోదండ‌రామ్

హైదరాబాద్: కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో కోదండరాం ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోవిడ్‌కు బలైన పాత్రికేయులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కరోనాపై ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలపైన పెట్టిన శ్రద్ధ ప్రభుత్వం కరోనా కట్టడిపై పెట్టలేదని కోదండరాం దుయ్యబట్టారు. హైకోర్టు ప్రశ్నించడం వలనే ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించి చేతులు దులుపుకుందన్నారు. ప్రభుత్వం వైద్య సదుపాయాలను కల్పించలేకపోయుందని విమర్శించారు. ప్రభుత్వం చేతులెత్తేయటంతో ప్రజలే స్వచ్చందంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించుకుంటున్నారని తెలిపారు. కరోనా బారిన పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement