కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ తమ కొత్త భవనం నిర్మాణ నమూనాను విడుదల చేసింది. స్థానిక ఆర్కిటెక్ట్ ఆఫ్ రికార్డ్‌గా ఎస్.ఘోష్ అండ్ అసోసియేట్స్ సహకారంతో ప్రఖ్యాత ఘనాయన్-బ్రిటీష్ ఆర్కిటెక్ట్ సర్ డేవిడ్ అడ్జాయే రూపొందించిన ఈ భవనం, ఢిల్లీలో తమ తలుపులు 2026లో తెరిచినప్పుడు భారతదేశంలో అతిపెద్ద సాంస్కృతిక కేంద్రంగా అవతరిస్తుంది. న్యూఢిల్లీలోని ఈ భవన నిర్మాణ ప్రాంగణం వద్ద జరిగిన భూమిపూజ కార్యక్రమంలో ఈ నమూనా విడుదల చేశారు.
కేఎన్ఎంఏ ను 2010లో భారతదేశం, ఉపఖండం నుండి ఆధునిక, సమకాలీన ఆర్ట్ కలెక్టర్ లలో ఒకరిగా గుర్తింపు పొందిన కిరణ్ నాడార్ ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో మార్గదర్శక ప్రైవేట్ మ్యూజియంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దీని శాఖలు న్యూఢిల్లీ, నోయిడాలో ఉన్నాయి. 100,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ కొత్త ప్రదేశం, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో జాతీయ రహదారి (ఎన్ హెచ్8)పై ఉంటుంది. మ్యూజియం 10,000 కు పైగా ఆధునిక, సమకాలీన కలెక్షన్ ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక చరిత్రపై ఆధారపడింది.