Friday, November 22, 2024

HYD: డోజీతో స్మార్ట్ వార్డుల‌తో మెరుగైన రీతిలో రోగి భ‌ద్ర‌త ప్రోగ్రామ్ ను ప్రారంభించిన కిమ్స్ హాస్పిట‌ల్స్

హైదరాబాద్ : ప్రఖ్యాత కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రధాన సంస్థ, కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్, రోగుల సంరక్షణను మెరుగు పరచడానికి డిజిటల్ ఫస్ట్ కార్యక్రమం స్మార్ట్ వార్డులతో మెరుగైన రోగి భద్రత (ఎన్హాన్సడ్ పేషంట్ సేఫ్టీ విత్ స్మార్ట్ వార్డ్స్) ప్రోగ్రామ్‌తో సాంకేతికతను స్వీకరించింది. ఈసంద‌ర్భంగా కిమ్స్ హాస్పిటల్స్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు మాట్లాడుతూ… ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా, త‌మ నిబద్ధత చికిత్సకు మించినద‌న్నారు. ఇది రోగుల సంరక్షణను పునర్నిర్వచించే పురోగతుల అవిశ్రాంత అన్వేషణను కలిగి ఉంటుందన్నారు. స్మార్ట్ వార్డులతో మెరుగైన రోగి భద్రత ప్రోగ్రామ్ కోసం డోజీతో త‌మ భాగస్వామ్యం, ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో త‌మ అంకితభావాన్ని ఉదహరిస్తుందన్నారు.

రీజనల్ మెడికల్ డైరెక్టర్, డాక్టర్ సుధీర్ విన్నమల మాట్లాడుతూ… ఆరోగ్య సంరక్షణ అనేది పరివర్తన దిశగా ఉందన్నారు. సాంకేతికత ఈ పరిణామానికి ఉత్ప్రేరకంగా నిలుస్తుందన్నారు. డోజీ ఏఐ-ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ పరిచయంతో తాము రోగుల సంరక్షణ ప్రమాణాలను పునర్నిర్వచిస్తున్నామన్నారు. డోజీ సీఈఓ అండ్ సహ వ్యవస్థాపకుడు ముదిత్ దండ్వాటే మాట్లాడుతూ… కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్స్‌తో త‌మ భాగస్వామ్యం ద్వారా రోగుల భద్రతకు ఒక మెరుగైన మార్గం వేసినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. స్మార్ట్ వార్డుల ద్వారా మెరుగైన రోగి భద్రత కార్యక్రమం ఈ దిశగా అతిపెద్ద ముందడుగుగా నిలుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement