కిలాడి ఎక్స్ లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలో సురేష్ రైనా, హర్భజన్ సింగ్, సనత్ జై సూర్య, చిలక రత్న, దిల్షాన్ రీఛార్జ్ లేవి ఇసురు ఉదానా, ప్రవీణ్ కుమార్, తీసారా పెరీరా తదితర విశ్రాంత క్రికెటర్లందరూ అలరించనున్నారు. భారత దిగ్గజ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కిలాడి ఎక్స్ లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీని మార్చి 22 నుంచి 30 తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న వి వి ఐ పి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో షెడ్యూల్ చేశారు. టీ 20 ఫార్మాట్ తో జరిగే ఈ పోటీల్లో ఆరు జట్లు పాల్గొననున్నాయి. తొమ్మిది రోజుల వ్యవధిలో ఇక్కడ 18 మ్యాచ్ లు ఆడనున్నారు. క్రికెట్ అభిమానుల కోసం ప్రపంచ స్థాయి క్రికెట్ ఆక్షన్ అందించడానికి ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు వెటర్న్ క్రికెట్ బోర్డు అసోసియేషన్ అధ్యక్షుడు రవితేజ తెలిపారు. గుర్తింపు పొందిన క్రీడాకారులను కళ్ళ ముందుకు తీసుకొచ్చి వారి క్రీడా ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించేందుకు, క్రీడాభిమానులకు ఉత్సాహాన్ని కలిగించేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఈ ట్రోపీలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, అభిమానులను అలరించాలని ఆశతో ఈ టోర్నమెంట్ కు వస్తున్నామన్నారు.
పోటీల్లో పాల్గొనే జట్లు :
చండీగఢ్ చాన్స్, ఇండోర్ నైట్స్, వైజాగ్ టైటాన్స్, నాగపూర్ నింజాస్, పాట్నా వారియర్స్, గౌహతి అవెంజర్స్ పేర్లతో ఈ జట్లు పాల్గొననున్నాయి. రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ లాంటి క్రీడాకారులు ఈ పోటీల్లో అలరించనున్నారు. ఈ పోటీలను డీడీ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ యూకే, ఆస్ట్రేలియా, నేపాల్, కరేబియన్ దేశాల్లో యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.