లాక్ డౌన్ పై నిర్ణయం సీఎందే: హోంమంత్రి మహమూద్ అలీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హోం మంత్రి కీలక సమావేశం
మే 1తో ముగియనున్న నైట్ కర్ఫ్యూ… ఆ తర్వాత పరిస్థితి ఏంటి
రద్దీని కట్టడి చేయాలని కోరిన వైద్య ఆరోగ్యశాఖ
శుక్రవారం సీఎం నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగే అవకాశం
రేపే నిర్ణయం… అవసరమైతే కేబినెట్ భేటీ
హైదరాబాద్, : లాక్‌డౌన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మే1తో నైట్ కర్ఫ్యూ గడువు ముగియనుండగా, ఆ త ర్వాత చేపట్టాల్సిన చర్యలు, తాజాగా హోంశాఖకు అందిన ప్రతిపాదనలపై హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోం సెక్రెటరీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు కమిషనర్ల ఆధ్వర్యంలో సమీక్ష చేశారు. ఈనెల 30 తర్వాత లాక్‌డౌన్ పెట్టాలన్న ప్రతిపాదన, తాజాగా హైకోర్టు చేసిన సూచనలు.. ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రద్దీ కట్టడికి సంబంధించి పలు ప్రతిపాదనలపై చర్చించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. హోంమంత్రి మహమూద్ అలీ ఈ సమీక్ష నిర్వహించగా, పోలీసుశాఖ సన్నద్దత, సమస్యలపై చర్చించినట్లు సమాచారం. లాక్‌డౌన్ పై సీఎం కేసీఆరే నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష అనంతరం ప్రకటిం చారు. గత కొద్దిరోజులుగా వందలసంఖ్యలో పోలీసుయంత్రాంగం కొవిడ్ బారిన పడింది. పలువురు మృత్యుబారిన పడ్డారు. పోలీసుయంత్రాంగాన్ని కాపాడుకుంటూ.. ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. తాజాగా హైకోర్టు పగలురద్దీని కట్టడి చేయాలని, భౌతిక దూరానికి సంబంధించి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపైకేసులు నమోదు చేయా లని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
సీఎం సమీక్షలోనే నిర్ణయం
లాక్‌డౌన్‌కు సంబంధించి సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాకే స్పష్టత రానుంది. మే 1తో నైట్ కర్ఫ్యూ గడువు ముగియనుండగా, దీనిని కొనసాగించాలా.. కట్టడిని మరింత పెంచాలా అన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ సూచనలు, పోలీసు శాఖ సమీక్ష సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలు కీలకం కానున్నాయి. లాక్‌డౌన్‌తోనే.. కట్టడి సాధ్య మని నిపుణులు అంటున్నారు. మహారాష్ట్ర తరహాలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు పెట్టాలా.. పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలా అన్న దా నిపై చర్చలు జరుగుతు న్నా యి. వీకెండ్ లాక్ డౌన్ విధించాలా.. కర్నాటక నిర్మా ణరంగానికి మినహాయింపు ఇచ్చిన తరహాలో పలు పారిశ్రామికరంగాలకు మినహాయింపునిచ్చి ప్రజలు గుమిగూడే అన్ని కార్యక్రమాలు పూర్తి స్థాయిలో రద్దుచేయాలా అన్న అంశాలపై పలు ప్రతిపాదనలుప్రభుత్వం పరిశీలిస్తోంది. అవసరమైతే ఏప్రిల్ 30 లేదా మే 1న కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం యో చిస్తున్నట్లు సమాచారం. లాక్‌డౌన్ వదంతులు గతకొద్ది రోజులుగా సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. మరోసారి లాక్‌డౌన్ పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర వుతాయోనని సామాన్యులు భయ పడుతు న్నారు. హైదరాబాద్ శివార్లలో పారిశ్రామిక కంపెనీలో పని చేస్తున్న బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వలస కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ రోజూ టెన్షన్ పడుతూ ఉండే కంటే ఊరెళ్లడమే ఉత్తమమంటూ వారు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఆందోళన కలిగిస్తున్న కేసులు
రాష్ట్రంలో గత పదిరోజులుగా నైట్ క ర్ఫ్యూ అమలుజరుగుతోంది. కర్ఫ్యూ అమలు తర్వాత కేసుల సంఖ్య తగ్గకపోగా.. మరింత పెరుగుతోంది. కేసుల కంటే ఆందోళన కలిగి స్తున్న పరిణామం మరణాల సంఖ్య. గత ఏడా దికంటే రెండు, మూడు రెట్ల కేసులు నమో దవుతుండగా.. 50నుండి వంద మరణాలు జరుగుతుండడం ప్రభుత్వాన్ని ఆందోళన పరుస్తోంది. ప్రభుత్వ చర్యల వల్ల ఆక్సిజన్ కొరత, మం దుల కొరత తీరినా.. ఇప్పటికే గాంధీలాంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటి లేటర్ బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రైవె ట్ ఆస్పత్రుల సంగతిసరేసరి. వైద్యరంగంపై ఒత్తిడి తగ్గించాల్సిన అనివార్యత ఉంది. ఈ క్రమంలో కర్ఫ్యూ కొనసాగిస్తూ వీకెండ్ లాక్ డౌన్, లేదా కొన్ని రంగాలకు మినహాయింపు నిస్తూ పూర్తిస్థాయి లాక్ డౌన్ వారం.. పది రోజులు నిర్వహిం చాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ అన్నింటినీ సమీక్షించి ప్రజా రోగ్యం, వైద్యరంగ సన్నద్దత.. వసతులను బట్టి నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్రం అడుగులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది.
లాక్‌డౌన్ విధించడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదు: హోంమంత్రి మహమూద్ అలీ
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పక డ్బంధీ చర్యలు తీసుకుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అయినప్పటికీ కేసులు శరవేగంగా పెరుగుతున్నందున లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్ పెరుగుతుందని, లాక్‌డౌన్ విధించడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి పోలీసు ఉన్నతా ధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి త్వరలో రాష్ట్రంలోని పరిస్థితులపై కేసీఆర్‌కు వివరిస్తామని, ఆయన సమీక్ష నిర్వహిం చనున్నారని చెప్పారు.
పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో గత ఏడాది కాలంగా పోలీసులు కోవిడ్ నివారణ కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో పోలీసులు ముందున్నారన్నారు. వైద్య, ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయంతో పని చేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెమిడెసివర్, ఆక్సిజన్ తదితర లైఫ్ సెవింగ్ డ్రగ్స్ కొరత లేదన్నారు. ఆక్సిజన్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు మంత్రి సూచించారు.
కరోనా కట్టడిలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం లాంటి వాటిని అనుసరించాలని మంత్రి కోరారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. రంజాన్ నేపథ్యంలో ముస్లిం సోదరులు నమాజ్, తరావీలు చేసే సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జ్వరం, దగ్గు, జలుబు తదితర ఇబ్బందులుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే టెస్ట్ చేయించుకోవాలని, కాలయాపన చేయడం ద్వారా వ్యాధి తీవ్రతరమయ్యే అవకాశం ఉందన్నారు. కోవిడ్‌పై సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు చేసినా, భయాందోళనలు కలిగించే విధంగా పోస్టింగ్‌లు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమీక్ష సమావేశంలో హోం శాఖ కార్యదర్శి రవి గుప్త, డీజీపీ మహేందర్‌రెడ్డి, గ్రేటర్ పరిధిలోని ట్రై కమిషనర్లు అంజనీకుమార్, వీసీ సజ్జన్నార్, మహేష్ భగవత్, హైదరాబాద్ ట్రాఫిక్ సీపీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.