హైదరాబాద్: తెలంగాణాలో క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కు తీసుకోవాలసిన చర్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతాధికారులతోనూ, అందుబాటులో ఉన్న మంత్రులుతోనూ చర్చలు జరుపుతున్నారు.. లాక్ డౌన్ పై చర్చించేందుకు నేటి ఉదయం మంత్రి కెటిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తో కలసి ప్రగతి భవన్ లో చర్చించారు.. కెటిఆర్, ఈటల అసెంబ్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లి చర్చలలో పాల్గొన్నారు.. లాక్ డౌన్ పై రేపు కేసిఆర్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.. ఇప్పటికే 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్ని పైతరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పాఠశాలల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో చేస్తున్నది.. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణలో వీకెండ్స్‌లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారు. అలాగే ఈ నెల 26 కంటే ముందే అసెంబ్లీ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది..
Advertisement
తాజా వార్తలు
Advertisement