కేసీఆర్ సీఎం అయిన తర్వాతే విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ రామంతపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంతకు ముందున్న ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో విద్యా రంగ వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత కేసీఆర్ దేనన్నారు. రామంతపూర్ పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం తనవంతుగా రూ.20 వేలను ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బోనగిరి శ్రీనివాసులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సంబు పాండయ్య గుప్తా, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు, హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు కాచం కృష్ణమూర్తి గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చు శ్రీనివాస్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ కూర నాగరాజు, టీఆర్ఎస్వీ నాయకులు ప్రశాంత్ గౌడ్, ఉడుత పురుషోత్తం, కాచం కృష్ణమూర్తి, కాసం వెంకట హరి గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా సెక్రెటరీ ట్రెజరర్ తాటి శ్రీనివాస్ గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ అడ్వైజర్ అండ్ ట్రెజరర్ వూరే నగేష్ గుప్త, గడ్డం సాయి, గట్టు ప్రకాష్, ప్రధానోపాధ్యాయులు సిహెచ్.సాంబయ్య, చంద్రశేఖర్, సుజాత జోషి, నాగరాజు, ఎండి అక్బర్, సురేంద్ర చారి, అనిత రెడ్డి, సత్యనారాయణ, శ్రీలత, శ్రీధర్, నీలిమ, వసంత, అరుణజ్యోతి, ప్రమీల, పద్మాలత, సురేంద్రనాథ్ ఠాగూర్, వెంకటేశం, స్వప్న రాణి, రాధిక, శ్రీనివాస్, సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.