Friday, November 22, 2024

కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి – సినీ,రాజకీయ ప్రముఖుల ట్విట్స్

హైదరాబాద్ కరోనా బారినపడిన సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు, పలు పార్టీల నాయకులు ఆకాంక్షించారు.‘‘గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసి ఆందోళనకు గురవుతున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. కేసీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలి’’ అంటూ గవర్నర్‌ ట్వీట్‌ చేశారు.

కరోనా బారినపడిన సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.ఆయన త్వరలోనే పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌కు క‌రోనాపై కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆయ‌న‌ స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం సీఎం ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని రాష్ట్ర మంత్రి, సీఎం త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ట్వీట్ చేశారు. వైద్యుల బృందం నిరంత‌రం కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్న‌ద‌ని తెలిపారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల నుంచి సందేశాలు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. అంద‌రి ప్రార్థ‌న‌ల‌తో ఆయ‌న త్వ‌రగా కోలుకుంటార‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు

.రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌, గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

.’’‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’‌ అని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు.

- Advertisement -

‘‘సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి. కేసీఆర్‌ సార్‌.. గెట్‌వెల్‌ సూన్’’‌ అంటూ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశారు.

‘‘సీఎం కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు.‘

‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో త్వరలో కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని ఆకాంక్షిస్తున్నా’’‌ అని సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్ అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement