హైదరాబాద్ – నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంతో తాను స్వయంగా పాల్గొననున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు దివంగత నేత నోముల నర్శింహయ్య కుమారుడు భగత్ కు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నల్గొండ జిల్లా టిఆర్ ఎస్ నేతలతో కెసిఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే తమ పార్టీ అభ్యర్ధి ఓటమి చెందారనే అభిప్రాయం వ్యక్తం చేశారు..ఈసారి అటువంటి పొరపాట్లకు తావివ్వకుండా తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని వెల్లడించారు.. అలాగే టిఆర్ ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ సైతం ప్రచారాన్ని నిర్వహిస్తారని నల్గొండ జిల్లా నేతలకు చెప్పారు… సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలమని కేసీఆర్ తెలిపారు. పార్టీలోఅంతర్గత విభేదాలు పక్కనబెట్టి గెలుపు కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో సాగర్‌లో కష్టపడాలని కేసీఆర్ నేతలను కోరారు..