Tuesday, November 26, 2024

నిజమాబాద్ విషాదంపై కెసిఆర్ దిగ్ర్భాంతి…

హైద‌రాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ జారిపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కెసిర్ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. స్నానం చేయడానికని నదిలో దిగి దురదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందని సీఎం విచారం వ్య‌క్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాల‌ను తగిన విధంగా ఆదుకోవాల‌ని అధికారుల‌ను కెసిఆర్ ఆదేశించారు.

మంత్రి ప్రశాంత‌రెడ్డి సంతాపం
పోచంపాడు పుష్కర ఘాట్‌లోఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మరణం పట్ల రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఖమ్మం పర్యటనలో ఉన్న మంత్రి వేముల విషయం తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్నానానికి గాను గోదావరి నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబ సబ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని మంత్రి కోరుకున్నారు. మృతుల కుటుంబాలను అండగా ఉంటామన్నారు.

వారి మ‌ర‌ణం కలిచివేసింది – ఎమ్మెల్సీ క‌విత‌..
పోచంపాడు పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో ఆరుగురు మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్నానానికి గాను నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కాగా,
నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురిలో ఆరుగురు మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డిన వ్య‌క్తిని ద‌ర్ప‌ల్లి ర‌వికాంత్(15)గా గుర్తించ‌గా.. మృతుల‌ను జిల‌క‌ర్ర సురేశ్‌(40), జిల‌క‌ర్ర యోగేష్‌(16), బొబ్బిలి శ్రీనివాస్ (40), బొబ్బిలి సిద్ధార్థ్‌(16), బొబ్బిలి శ్రీక‌ర్(14), దొడ్లె రాజు(24)గా గుర్తించారు. మృత దేహాల‌ను న‌ది నుంచి బ‌య‌ట‌కు తీశారు..పోస్ట్ మార్ట‌మ్ కోసం హాస్ప‌ట‌ల‌కు త‌ర‌లించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement