హైదరాబాద్: అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సిఎండి కటారు రవి కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ మర్యాదపూర్వక సమావేశ సమయంలో చంద్రబాబు నాయుడు అద్భుతమైన విజయం సాధించినందుకు రవి కుమార్ అభినందించారు. అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా ప్రధాన పరిశ్రమల్లో అవకాశాలను అన్వేషించడానికి అసోచామ్ నిబద్ధతను ఆయన వెల్లడించారు.
కటారు రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పారిశ్రామిక వృద్ధిని, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుందని తాను విశ్వసిస్తున్నానన్నారు. ప్రధాన పరిశ్రమల్లో కొత్త అవకాశాలను అన్వేషించడానికి, రాష్ట్రాభివృద్దికి దోహదపడేందుకు అసోచామ్ ప్రభుత్వంతో సహకరిస్తుందన్నారు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ హెడ్ మచ్చా దినేష్ బాబు, అసోచామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్రంలో పారిశ్రామిక, వివిధ రంగాల అభివృద్ధికి సాధ్యమైన అన్ని విధాలుగా మద్దతునిస్తుందని వెల్లడించారు.